Saturday, April 18, 2026
E-PAPER
Homeఆటలుగాయత్రి, ట్రెసా జోడీ అవుట్‌

గాయత్రి, ట్రెసా జోడీ అవుట్‌

- Advertisement -

ఉబర్‌ కప్‌ 2026
న్యూఢిల్లీ : భారత మహిళల డబుల్స్‌ స్టార్‌ పుల్లెల గాయత్రి, ట్రెసా జాలి జోడీ ప్రతిష్టాత్మక ఉబర్‌ కప్‌ నుంచి తప్పుకున్నారు. స్విస్‌ ఓపెన్‌లో భుజం గాయానికి గురైన ట్రెసా జాలి.. గాయం నుంచి కోలుకుని ప్రాక్టీస్‌ చేస్తుండగా మళ్లీ గాయపడింది. ఆడుతూ భాగస్వామిని ఢకొీట్టిన ట్రెసా జాలి చీలమండ గాయానికి గురైంది. ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్స్‌కు ముంగిట గాయం బారిన పడిన ట్రెసా జాలి కోలుకునేందుకు నాలుగు వారాల సమయం పట్టనుంది. వచ్చే నెలాఖరులో జరిగే సింగపూర్‌లో ఓపెన్‌లో ఈ జోడీ రాకెట్‌ పడుతుందని భారత డబుల్స్‌ కోచ్‌ బి. సుమీత్‌ రెడ్డి తెలిపారు. ట్రెసా, గాయత్ర జోడీ స్థానంలో శృతి మిశ్రా, ప్రియ జంటను ఉబర్‌ కప్‌కు ఎంపిక చేశారు. అగ్రషట్లర్‌ పి.వి సింధు, ఉన్నతి హుడా, తన్వీ శర్మ, దేవిక, ఇషారాణిలు భారత జట్టులో ఉన్నారు. మంగళవారం నుంచి ఆరంభం కానున్న థామస్‌ కప్‌ కోసం చిరాగ్‌ శెట్టి, సాత్విక్‌సాయిరాజ్‌లు డెన్మార్క్‌లో ప్రాక్టీస్‌ చేయనున్నారు. ఉబర్‌ కప్‌లో చైనా, డెన్మార్క్‌, ఉక్రెయిన్‌లతో గ్రూప్‌ దశలో ఆడనున్న భారత్‌.. థామస్‌కప్‌లో చైనా, కెనడా, ఆస్ట్రేలియాతో తలపడనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -