Monday, April 20, 2026
E-PAPER
Homeజాతీయంఅర్థాంతరంగా పార్ల‌మెంట్ వాయిదా

అర్థాంతరంగా పార్ల‌మెంట్ వాయిదా

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: లోక్‌సభలో కేంద్రం ప్రవేశపెట్టిన మూడు కీలక బిల్లులు రాజ్యాంగ (131) సవరణ బిల్లు, మహిళా రిజర్వేషన్ కు లింక్ పెట్టే డీలిమిటేషన్‌, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లులను ప్రతిపక్షం తిప్పికొట్టింది. దీంతో 16-18 వరకు మూడురోజులు జరగాల్సిన సభ అర్థాంతరంగానే ముగిసింది. మూడోరోజు శనివారం లోక్‌సభ నిరవధిక వాయిదా పడింది. ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సభను కొద్దిసేపటికే స్పీకర్‌ ఓంబిర్లా నిరవధిక వాయిదా వేశారు. దీంతో జనవరిలో ప్రారంభమైన పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాయి నేటితో ముగిశాయి. సభ వాయిదా పడిన అనంతరం లోక్‌సభ స్పీకర్‌ తన కార్యాలయంలో పలువురు పార్లమెంట్‌ సభ్యులను కలిశారు. వారిలో ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి కిరణ్‌ రిజిజు, కాంగ్రెస్‌ ఎంపి కుమారి సెల్జా, కాంగ్రెస్‌ ఎంపి కె.సి వేణుగోపాల్ తదిత‌రులున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -