- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ సచివాలయంలో ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ నవీన్ మిట్టల్ వ్యక్తిగత కార్యదర్శి (PS)గా విధులు నిర్వహిస్తున్న రాజు ఆకస్మికంగా మృతి చెందారు. అసెంబ్లీ ప్రాంగణంలో విధి నిర్వహణలో ఉండగా.. రాజు ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే స్పందించిన మంత్రి వాకిటి శ్రీహరి ఆయనకు సీపీఆర్ చేసి, ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హుటాహుటిన ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పల్స్ పడిపోవడంతో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రాజు అకాల మరణం పట్ల సచివాలయ ఉద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
- Advertisement -



