Tuesday, September 8, 2026
E-PAPER
Homeతాజా వార్తలుహరీశ్‌ రావు, కేటీఆర్ అరెస్ట్

హరీశ్‌ రావు, కేటీఆర్ అరెస్ట్

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి కాలి నడకన వెళ్తున్న బీఆర్‌ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌ రావు సహా ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు హకీంపేట వద్ద అరెస్ట్ చేశారు. వారిని బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులతో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద అగ్రహం వ్యక్తం చేశారు. మా ఇంటికి కూడా మేం పోవద్దా అంటూ పాడి కౌశిక్ రెడ్డి పోలీసులను నిలదీశారు. ఈ క్రమంలో అక్కడ వాగ్వాదం నెలకొంది. పోలీసులు తమ వాహనాలను అడ్డుకోవడంతో బొల్లారం చౌరస్తా నుంచి ఎర్రవెల్లి వైపు కేటీఆర్, హరీశ్‌రావు, ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు పాదయాత్రగా బయల్దేరగా వారిని అడ్డుకొని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -