Tuesday, September 8, 2026
E-PAPER
Homeజిల్లాలుప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో జర్నలిస్టుకు ఆర్థిక సాయం

ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో జర్నలిస్టుకు ఆర్థిక సాయం

- Advertisement -

జర్నలిస్టు సంఘం అధ్యక్షులు బాల్ రెడ్డి 
నవతెలంగాణ-మిడ్జిల్ 

కష్టాలలో ఉన్న జర్నలిస్టులకు సహాయం చేయడం మిడ్జిల్ జర్నలిస్టులు ముందు వరుసలో ఉంటున్నారని జర్నలిస్టు సంఘం మండలాధ్యక్షులు బాల్ రెడ్డి అన్నారు. నమస్తే తెలంగాణ విలేకరి వరుణ్ రాజ్ అనారోగ్యానికి గురి కావడంతో మంగళవారం మండల కేంద్రంలోని వరుణ్ రాజ్ స్వగ్రాహానికి వెళ్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వరుణ్ రాజుకు రూ. 10,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుని, మానవత్వాన్ని చాటుకోవడం శుభ పరిణామమని కొనియాడారు.

వరుణ్ రాజుకు అండగా నిలవాలనే ఉద్దేశంతో విలేకరులు అంతా కలిసి ఈ చొరవ తీసుకున్నారనీ, భవిష్యత్తులోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. అనంతరం వరుణ్ రాజు ప్రెస్ క్లబ్ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రాజేష్ కుమార్, ఐజేయు మండల అధ్యక్షులు మహేష్ కుమార్, మండల జర్నలిస్టులు రాఘవేందర్ రెడ్డి, శ్రీనివాసులు, మల్లేష్, కేశవ్, బాల నారాయణ, శ్రీనివాసులు, ప్రతాప్, పరమేష్ తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -