నవతెలంగాణ-ఆలేరు టౌన్
గ్రామాల అభివృద్ధి కొర కు అసెంబ్లీ ముట్టడి విజయవంతం చేయాలని, యాదాద్రి భువనగిరి జిల్లా సర్పంచుల ఫోరం జేఏసీ అధ్యక్షులు, జూకంటి అనిల్, ఆలేరు పట్టణంలో మంగళవారం విలేకరులకు ఒక ప్రకటనలో తెలియజేశారు. జిల్లాలోని సర్పంచ్ లు, మాజీ సర్పంచులు తమ హక్కుల సాధనకు పెండింగ్ బిల్లుల మంజూరు కొరకు బుధవారం అసెంబ్లీ ఎదురుగా భారీ నిరసనకు, జిల్లా సర్పంచ్ లు పెద్దఎత్తున తరలిరావాలన్నారు.
జిల్లా సర్పంచుల సంఘం జేఏసీ సంబంధించిన అన్ని మండలాల అధ్యక్షులు, తమ మండల మాజీ సర్పంచులు, ప్రస్తుత సర్పంచులను సమన్వయం చేసి, నిరసన కార్యక్రమానికి విజయవంతం చేయాలన్నారు. మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని,గ్రామపంచాయతీలకు రావాల్సిన ఎస్ఎఫ్సి నిధులను తక్షణమే విడుదల చేయాలని, గ్రామపంచాయతీల అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను పూర్తిగా పరిష్కరించాలని, గ్రామపంచాయతీలకు ఆర్థిక వనరులు కల్పించి స్థానిక పాలనను బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.



