Tuesday, September 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంగరంగ వైభవంగా బీరప్ప బోనాలు

అంగరంగ వైభవంగా బీరప్ప బోనాలు

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు టౌను
ఆలేరు పట్టణంలో సోమవారం రాత్రి, కురుమ సంఘం ఆధ్వర్యంలో కురుమ పూజారులు, కుల సంఘ సభ్యుల సమక్షంలో, గొల్ల కురుమలు బీరప్ప బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. బోనాల ఉత్సవాలకు ముఖ్య అతిథిగా బిర్లా ఫౌండేషన్ చైర్మన్ బిర్లా అనిత హాజరయ్యారు. డబ్బు చప్పుల మధ్య బోనాలను మహిళలు సామూహికంగా తీసుకెళ్లి, అమ్మవార్లకు ప్రసాదాలు సమర్పించారు. ఈ సందర్భంగా అక్క మహంకాళి, బీరప్ప,కామరావతి, బుగ్గ పోచమ్మ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాల వద్ద చేరుకున్నారు.  ఈ కార్యక్రమంలో ఆలేరు మున్సిపల్ చైర్మన్ బీజని బాలమణి భాస్కర్,పెద్ద కుర్మ ఎగ్గిడి శ్రీను,కురుమ సంఘం అధ్యక్షులు చిన్నం యాదగిరి, కన్సిలర్లు,నాయకులు, ప్రజాప్రతినిధులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -