– ఇక వేచి చూడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు
– టీజీఈజేఏసీ జిల్లా చైర్మన్ గుంటుపల్లి శ్రీనివాసరావు
నవతెలంగాణ-సత్తుపల్లి
మూడేళ్లుగా ఓపికగా వేచి చూశామని, సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమ కార్యాచరణను ఉధృతం చేస్తామని తెలంగాణ ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్ల జేఏసీ (టీజీఈజేఏసీ) జిల్లా చైర్మన్ గుంటుపల్లి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం సత్తుపల్లి జేఏసీ కార్యాలయంలో యూనిట్ అధ్యక్షుడు కేశవరెడ్డి అధ్యక్షతన జిల్లా, డివిజన్ నాయకుల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంకా రెండేళ్లు ఎదురు చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనడం బాధ్యతారాహిత్యమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై వేచి చూసే ప్రసక్తి లేదని, రాజీలేని పోరాటాల ద్వారానే డిమాండ్లను సాధించుకోగలమని స్పష్టం చేశారు. ఈ నెల 10న హైదరాబాద్లో చేపట్టే ధర్నాను జయప్రదం చేయాలని, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పాల్గొన్న వివిధ సంఘాల నాయకులు ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు కొణిదెన శ్రీనివాస్, సుబ్బయ్య, వేణు, దుర్గాప్రసాద్, జైపాల్, రుక్మాంగదరావు, ప్రకాశరావు, రెవెన్యూ, మెడికల్, ఇరిగేషన్ తదితర శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఉద్యమిస్తేనే సమస్యల పరిష్కారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



