- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
డిఆర్డీఏ ఆదేశాలతో ఇండస్ట్రీ పాoడేషన్ జిల్లా కోఆర్డినేటర్ తాండ్ర రమేష్,ఎడ్లపల్లి, రుద్రారం గ్రామాల సర్పంచ్లు జంగిడి శ్రీనివాస్, చంద్రగిరి సంపత్ ఆధ్వర్యంలో రుద్రారం క్లస్టర్ లో వెదురు మొక్కలను రైతులకు ఉచితంగా పంపిణీ చేసినట్లుగా తెలిపారు. వెదురు మొక్కల పెంపకంతో అధిక లాభాలు ఆర్జించడంతోపాటు స్థిరమైన జీవనోపాధి పొందవచ్చని తెలిపారు. అనంతరం సబ్సిడీ మేకల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బడితేల కుమారస్వామి, చంద్రగిరి అశోక్, రాజశేఖర్, చిగురు సదయ్య, ఎపిఎం హనుమంతరావు, సిసి రవికుమార్, విఓఎలు, రైతులు పాల్గొన్నారు.
- Advertisement -



