నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండలంలో భూముల రీ-సర్వే ప్రక్రియ ప్రారంభమైంది. తిప్పాపూర్ రీ-సర్వే పైలెట్ ప్రాజెక్టులో భాగంగా మంగళవారం చేపట్టిన రీసర్వేకు సర్వే అధికారి రామానుజన్ ముఖ్య అతిథిగా హాజరై సర్పంచ్ శ్రీకాంత్ తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ మేరకు మండలంలోని నాలుగు గ్రామాలను ఎంపిక చేసి, భూముల హద్దులు, విస్తీర్ణం తదితర వివరాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నమోదు చేయనున్నట్లు తెలిపారు. రీ-సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్ షఫీ ఉల్లాదీన్, లైసెన్స్డ్ సర్వేయర్ మల్లేష్, డిప్యూటీ సర్పంచ్ రేణయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శేఖర్ యాదవ్, వార్డు సభ్యులు గుడి భీమయ్య, మాడుగుల చిట్టెమ్మ, మంజుల రాఘవరెడ్డి, శిరీష, ప్రభాకర్, అశోక్‌తో పాటు గ్రామ రైతులు, పెద్దలు, యువకులు పాల్గొన్నారు.
తిరుమలాపూర్లో భూముల రీ-సర్వే ప్రారంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



