టెహ్రాన్ : ఈ నెల ఐదు, ఆరు తేదీలలో హార్ముజ్ జలసంధిలో అమెరికా నౌకలను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ సేనలు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన విషయం తెలిసిందే. తొలిసారి నౌకా విధ్వంసక ఖసెమ్ బసీర్ బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగాలకు సంబంధించిన వీడియోలను ఐఆర్జీసీ తాజాగా విడుదల చేసింది. అణుశక్తితో నడిచే విమాన వాహక నౌకతో పాటు ఓ డిస్ట్రాయర్‌ను కూడా ధ్వంసం చేశామని ఇరాన్ తెలిపింది. ఖసెమ్ బసీర్ క్షిపణికి ఖుద్స్ దళాల నాయకుడైన ఐఆర్జీసీ మాజీ జనరల్ ఖసెమ్ సులేమని పేరు పెట్టారు. 2020లో ఆయన అమెరికా డ్రోన్ దాడిలో చనిపోయారు. తాజాగా ఇరాన్ దానిని మొదటిసారి యుద్ధభూమిలో ప్రయోగించింది. కాగా అమెరికా నౌకలను లక్ష్యంగా చేసుకొని దాడి చేసే సామర్ధ్యం, సాంకేతికత తమ వద్ద ఉన్నాయని ఇరాన్ తాత్కాలిక రక్షణ మంత్రి మజీద్ ఎబ్న్ అల్-రెజా హెచ్చరించారు.
తొలిసారి ఖసెమ్ బసీర్ క్షిపణిని ప్రయోగించిన ఇరాన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



