Sunday, April 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఐఎన్‌టీఏసీహెచ్‌ జాతీయ కార్యవర్గానికి ఇంజినీర్‌ వేదకుమార్‌ మణికొండ ఎన్నిక

ఐఎన్‌టీఏసీహెచ్‌ జాతీయ కార్యవర్గానికి ఇంజినీర్‌ వేదకుమార్‌ మణికొండ ఎన్నిక

- Advertisement -


దక్షిణ భారతానికి గర్వకారణం
నవతెలంగాణ – హైదరాబాద్‌

2026-29 మూడేండ్ల కాలానికి ఐఎన్‌టీఏసీహెచ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌కు ఎన్నికైన ఇంజనీర్‌ వేదకుమార్‌ మణికొండ శుక్రవారం న్యూ ఢిల్లీలోని ఐఎన్‌టీఏసీహెచ్‌ ప్రధాన కార్యాలయంలో ఐఎన్‌టీఏసీహెచ్‌ జాతీయ కార్యవర్గానికి కూడా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఐఎన్‌టీఏసీహెచ్‌ చైర్మెన్‌ అశోక్‌ సింగ్‌ ఠాకూర్‌, సభ్య కార్యదర్శి రవీంద్ర సింగ్‌ (రిటైర్డ్‌ ఐఏఎస్‌) సమక్షంలో ప్రకటించారు. ఈ గౌరవం ఆయన నాయకత్వం, అనుభవం, వారసత్వ పరిరక్షణపై ఉన్న అంకితభావానికి గుర్తింపుగా నిలుస్తోందని డెక్కన్‌ హెరిటేజ్‌ అకాడమీ ట్రస్ట్‌ చైర్మెన్‌ కె. ప్రభాకర్‌ తెలిపారు. ఈ పదవికి మణికొండ ఆయన ఎన్నిక కావడం ద్వారా సంస్థ పనుల్లో ఆయన మరింత సమర్థంగా సేవలందిస్తారనే నమ్మకం వ్యక్తమవుతోంది. దక్షిణ భారతదేశం నుం,ఇ ఐఎన్‌టీఏసీహెచ్‌ జాతీయ కార్యవర్గానికి ఎన్నికైన కొద్దిమందిలో ఇంజినీర్‌ వేదకుమార్‌ మణికొండ ఒకరు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -