Wednesday, September 9, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : చెక్కులపై ఉపసర్పంచ్​లు సంతకాలు చేయడంలో జాప్యం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చెక్కుపై సర్పంచ్​ సంతకం అయ్యాక ఉప సర్పంచ్​ సంతకం చేయడానికి వారం రోజుల సమయాన్ని ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఒకవేళ ఉప సర్పంచ్​ వారం రోజుల్లో సంతకం చేయకుంటే.. ఆ పనికి సంబంధించిన బిల్లుకు కలెక్టర్​ ప్రొసిడింగ్​ జారీ చేసే అధికారాన్ని ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు పంచాయతీ రాజ్​ చట్ట సవరణ చేయనున్నారు. కాగా ఉప సర్పంచ్‌ల చెక్​ పవర్‌ను రద్దు చేస్తే రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -