Wednesday, September 9, 2026
E-PAPER
Homeఖమ్మంప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు సాధించిన బేతుపల్లి విద్యార్థి

ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు సాధించిన బేతుపల్లి విద్యార్థి

- Advertisement -

– అభినందించిన గ్రామ సర్పంచ్ దొడ్డా రాజేంద్రప్రసాద్ 
నవతెలంగాణ-సత్తుపల్లి

వైద్యుడిగా పేదలకు సేవ చేయాలనే లక్ష్యంతో పట్టుదలతో శ్రమించి, కరీంనగర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించిన బేతుపల్లి గ్రామానికి చెందిన జస్వంత్ కుమార్ తన కలను సాకారం చేసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ దొడ్డా రాజేంద్ర ప్రసాద్ (అమ్ములు) జస్వంత్ కు ఆర్థిక సహాయం అందించి అభినందించారు. భావి వైద్యుడిగా ఎంతో మంది పేదలకు సేవ చేయాలని కోరుతూ, తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని సర్పంచ్ ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ మండల పార్టీ మాజీ అధ్యక్షులు శివా సత్యనారాయణమూర్తి (వేణు), గంగాజీ, గ్రామ కాంగ్రెస్ నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొని జస్వంత్ కు అభినందనలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -