- Advertisement -
నవతెలంగాణ-సత్తుపల్లి
కరీంనగర్లో ఈ నెల 6, 7, 8 తేదీలలో నిర్వహించిన ఏఐటీయూసీ 4వ రాష్ట్ర మహాసభలలో సత్తుపల్లి పట్టణానికి చెందిన నిమ్మటూరి రామకృష్ణ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రామకృష్ణ ప్రస్తుతం మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడిగా, ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కార్మిక హక్కుల సాధనకు ఆయన అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ పదవి దక్కింది. రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా రామకృష్ణ ఎంపిక కావడం పట్ల పలువురు నాయకులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -



