- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని తడి హిప్పర్గా గ్రామంలో మిషన్ భగీరథ వాటర్ సప్లై కొన్ని వాడల్లో అసలే రావడం లేదు. కొన్ని వాడల్లో పైప్ లైన్ మురికి కాలువల నుండి వెళ్లడం గ్రామస్థులకు ఇబ్బందికరంగా ఉందని సర్పంచ్ అశ్విని సుదర్శన్ మున్నా అన్నారు. ఈ విషయాన్ని ఆదివారం ఆయన మిషన్ భగీరథ అధికారుల దృష్టికి తీసుకెళ్ళారు. ఈ క్రమంలో మిషన్ భగీరథ డిఈ ధర్మేందర్, ఏఈ మహబూబ్ ఆ గ్రామాన్ని సందర్శించి, నీటి సరఫరా కాని వాడలను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. త్వరలోనే గ్రామంలోని సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. గ్రామాభివృద్దికి సర్పంచ్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని అన్నారు. సర్పంచ్ కృషి అభినందనీయమని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -



