మనం ఆరోగ్యంగా ఉండటానికి.. సమతుల్య, పోషకాహారం చాలా అవసరం. మన శరీరానికి.. పోషకాలు సమద్ధిగా అందాలంటే రోజూ కాసిని మొలకలు తినాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు. మొలకలు పోషకాల స్టోర్ హౌస్. మొలకెత్తిన విత్తనాలు చూడటానికి చిన్నగా ఉండొచ్చు.. కానీ ఇవి చేసే మేలు అద్భుతం అని చెప్పొచ్చు. చాలామంది సలాడ్‌లు, శాండ్‌విచ్‌లు, స్టైర్-ఫ్రైస్‌లా చేసుకుని తీసుకుంటూ ఉంటారు. మొలకెత్తిన గింజల్లో విటమిన్స్, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటిలో ఫైబర్, ప్రొటీన్, ఎంజైమ్‌లు కూడా అధికంగా ఉంటాయి. అదనంగా, మొలకల్లో విటమిన్ సి, ఫోలేట్, ఐరన్, పొటాషియం వంటి పోషకాలు సమద్ధిగా ఉంటాయి. రోజూ గుప్పెడు మొలకలు తీసుకుంటే.. ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చో ఈ స్టోరీలో చూద్దాం.?
బరువు తగ్గుతారు..
మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే.. మీ డైట్‌లో మొలకెత్తిన విత్తనాలు కచ్చితంగా చేర్చుకోండి. మొలకెత్తిన విత్తనాల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థ పని తీరును మెరుగుపరుస్తుంది. ఫైబర్ కడుపు నిండిన అనూభూతిని ఇస్తుంది. తద్వారా అతిగా తినకుండా కంట్రోల్‌లో ఉంటారు. అంతేకాదు, మొలకల్లో జింక్, ఇనుము, క్యాల్షియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఈ పోషకాలు శరీరంలోని అన్ని అవయవాలకూ.. ఆక్సిజన్‌ను సక్రమంగా సరఫరా చేస్తాయి.
జీర్ణక్రియకు మేలు
జీవనశైలి మార్పులు, చెడు ఆహార అలవాట్ల కారణంగా.. ఈ రోజుల్లో చాలామంది మహిళలు హార్మోన్ల అసమతులత్యతో బాధపడుతున్నారు. అధికబరువు, నెలసరి క్రమం తప్పడం, సంతానలేమి సమస్యలు ఎదురవుతున్నాయి. మీరూ హార్మోన్ అసమతుల్యతతో బాధపడుతుంటే.. పెసర్లు, రాగులూ, బొబ్బర్లు, రాజ్మా వంటివన్నీ కలగలిపి వాటితో పాటూ ఒక ఖర్జూరం కలిపి తీసుకుంటే మంచిది.
ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది..
మొలకలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది, ఇన్ఫెక్షన్ల నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి. జలుబు, ఫ్లూ వంటి అనారోగ్యాలు రాకుండా అడ్డుకుంటాయి. మొలకల్లో బి గ్రూప్ విటమిన్లు మెండుగా ఉంటాయి. ఇవి ఆహారాన్ని శక్తిగా మార్చడానికి సహాయపడతాయి. మీ స్టామినాను పెంచుతాయి.
గుండె ఆరోగ్యానికి
మొలకల్లో పొటాషియం, ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ రెండూ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ పోషకాలు హైపర్‌టెన్షన్‌ను తగ్గించడానికి తోడ్పడతాయి, గుండె సంబంధ సమస్యల ముప్పును తగ్గిస్తాయి.
రోజూ గుప్పెడు….
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



