ఐరాస సెక్రెటరీ జనరల్ గుటెర్రెస్
న్యూయార్క్ : ప్రపంచం ఘర్షణలు, అసమానతలు, వాతావరణ మార్పుల ఒత్తిడులు, వేగవంతమైన సాంకేతిక మార్పులు వంటి పరిణామాలను ఎదు ర్కొంటున్న తరుణంలో బహు పాక్షిక వాదం, అంతర్జాతీయ సహకారంపై విశ్వా సాన్ని పునరుద్ధరించాలని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ పిలుపునిచ్చారు. ఐరాస 81వ సర్వసభ్య సమావేశంలో మంగళవారం ఆయన ప్రారంభోపన్యాసం చేస్తూ ప్రపంచ సవాళ్లకు సమర్ధవంతంగా ప్రతిస్పందిం చేందుకు ఐరాస సామర్ధ్యాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నదని నొక్కి చెప్పారు. జనరల్ అసెంబ్లీ అధ్యక్ష పదవిని తాత్కాలికంగా చేపట్టిన ఖలీలుర్ రెహ మాన్కు ఆయన అభినందనలు తెలిపారు. దౌత్యం, చర్చలు, సామూహిక చర్యల ద్వారా విభేదాలను పరిష్కరించుకోగల వేదికగా ఐరాస ప్రాముఖ్యతను గుటెర్రస్ వివరించారు. జనరల్ అసెంబ్లీ 81వ సమావేశం వచ్చే సంవత్సరం సెప్టెంబర్ వరకూ కొనసాగుతుంది. ఈ నెల చివరలో జరిగే వార్షిక ఉన్నతస్థాయి చర్చల కోసం ప్రపంచ నేతలు న్యూయార్క్లో సమావేశం అవుతారు. ఐరాసకు అత్యంత కీలకమైన తరు ణంలోతాను ఈ బాధ్యతలు చేపట్టానని నూతన అధ్యక్షుడు ఖలీలుర్ రెహమాన్ చెప్పారు. ఐరాస తొమ్మిదో దశాబ్దంలోకి అడుగు పెడుతున్న సమయంలో గతంలో సాధించిన అనేక విజయాలను ఆయన ప్రస్తావించారు. అదే సమయంలో ఐరాస తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోందని అన్నారు. అంచనాలను అందుకోవడంలో ఐరాస తరచుగా విఫలమైందని, వివిధ దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణలు అపారమైన నష్టాలను మిగిల్చాయని, అభివృద్ధి విజయాలు బలహీనంగా ఉన్నా యని తెలిపారు. వాతావరణ మార్పుల ప్రభావాలు తీవ్రంగా ఉన్నాయని రెహ మాన్ ఆందోళన వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ సహకారంపై విశ్వాసాన్ని పునరుద్ధరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



