- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: భువనగిరి మండలం, బొమ్మాయిపల్లి గ్రామ మాజీ సర్పంచ్, సీపీఐ(ఎం) భువనగిరి డివిజన్ మాజీ కమిటీ సభ్యులు బండి రాములు నిన్న రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతికి సీపీఐ(ఎం) యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ తరఫున సీపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి రమ, సాహితీ స్రవంతి జిల్లా కన్వీనర్ జిట్టా భాస్కర్ రెడ్డి, వడాయిగూడెం మాజీ సర్పంచ్ రాసాల నర్సింహ వారి పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనమైన శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఒదార్చిచారు.

- Advertisement -



