Monday, April 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మిడ్జిల్ సంత వేలం రద్దు చేయాలి 

మిడ్జిల్ సంత వేలం రద్దు చేయాలి 

- Advertisement -

ప్రజావాణిలో ఫిర్యాదు 
నవతెలంగాణ – మిడ్జిల్ 

మిడ్జిల్ పశువుల సంత వేలం డబ్బులు చెల్లించని కాంట్రాక్టు రద్దుచేసి విధులలో నిర్లక్ష్యం చేస్తున్న పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని, మాజీ ఎంపీపీ సుదర్శన్, గ్రామస్తులు,జగన్ గౌడ్, రవీంద్ర,గొల్ల జంగయ్య,సురేష్ కుమార్,ప్రభుదాస్,కృష్ణయ్య సోమవారం ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతరం మాజీ ఎంపీపీ సుదర్శన్ మాట్లాడుతూ, మార్చు 29న గ్రామపంచాయతీలో పశువుల సంత బహిరంగ వేలం నిర్వహించారు. వేలంలో మిడ్జిల్ గ్రామానికి చెందిన రాముగౌడ్ అను వ్యక్తి వేలం లో 19,60,000 లకు వేలం లో సంత దక్కించుకోవడం జరిగింది. 24 గంటల్లో 50 శాతం డబ్బులు చెల్లించి సంత లోకి పోవాలని గ్రామపంచాయతీ కార్యదర్శి,సర్పంచ్, వార్డు సభ్యులు,గ్రామస్తుల సమక్షంలో మాట్లాడటం జరిగింది చెప్పారు కానీ వేలం జరిగి దాదాపు 20 రోజులు అవుతున్న  కాంట్రాక్టర్ డబ్బులు చెల్లించకపోవడం పంచాయతీ కార్యదర్శి వేలం జరిగిన నాటి నుండి ఈరోజు వరకు అందుబాటులో లేకపోవడం పలు అనుమానాలకు తవిస్తుంది అని  విమర్శించారు. గ్రామపంచాయతీ నిర్లక్ష్యంగా వ్యవహరస్తుందని జిల్లా అధికారుల స్పందించి చర్యలు తీసుకోవాలని  ప్రజావాణి లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -