ఆయిల్ ఫామ్ & ఉద్యాన పంటల సాగు లాభదాయకం
పంట మార్పిడితో అధిక ఆదాయం
జిల్లా ఉద్వాన, పట్టు పరిశ్రమల అధికారి జీనుగు మరియాన్న
నవతెలంగాణ – నెల్లికుదురు
నూతన రైతులకు ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన కల్పిస్తూ ఆయిల్ ఫామ్ అండ్ ఉద్వాన పంటల సాగు పంట మార్పిడితో అధిక లాభ సాటి ఉంటుందని జిల్లా ఉద్వాన మరియు పట్టు పరిశ్రమల అధికారి జీనుగు మరియాన్న అన్నారు.
సోమవారం గ్రామ గ్రామాల్లో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయిల్ పామ్, ఉద్యాన, కూరగాయలు, పండ్లు, పూలు, మల్బరీ మొదలైన మార్కెట్ డిమాండ్ ఉన్న పంటల సాగు, పుట్టగొడుగులు, తేనెటీగల పెంపకం, మామిడి కాయలకు ఫ్రూట్ బాగింగ్ మరియు రాయితీలు వేసవిలో తీసుకోవలసిన మేలైన యాజమాన్య పద్దతులు వరి, పత్తి, మిరప, మొక్కజొన్న వంటి పంటలకి బదులుగా మార్కెట్ డిమాండ్ ఉన్న ఆయిల్ పామ్, అన్ని రకాల కూరగాయలు, పండ్లు, మునగ, ఉల్లి, వెల్లుల్లి, పూలు, మల్బరీ మొదలైన పంటలు సాగు చేయాలి తెలిపారు.మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలు సాగు చేయాలని, నిత్యం రోగనిరోధక శక్తికి, ఆరోగ్యంగా ఉండటానికి పోషకాలు అందించే పండ్ల తోటలు అయిన జామ, నిమ్మ, అరటి, బొప్పాయి, సీతాఫలం, పనస, నేరేడు, అవకాడో, ఫ్యాషన్ ఫ్రూట్, కూరగాయలు, ఆకు కూరలు, మునగ, వెదురు మొదలైనవి సాగు చేయాలని తద్వారా ఎకరానికి లక్ష రూపాయలు నికర ఆదాయం పొందవచ్చు అని రైతులకు తెలిపారు.
ఈ కార్యక్రమంలో యం. ఐ. ఇంజనీర్ డి. రాజకిశోర్, ఉద్యాన విస్తరణ అధికారి టి. విజయ పాల్ రెడ్డి, ఆయిల్ ఫెడ్ ఫీల్డ్ అధికారులు నర్మద, రాజ్ కుమార్ మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.



