నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని హస కొత్తూర్ గ్రామంలో సోమవారం చౌట్ పల్లి సింగిల్ విండో ఆధ్వర్యంలో రైతుల సౌకర్యార్థం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ నలిమేల రేవతి గంగారెడ్డి చేతుల మీదుగా ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గంగారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం ప్రతీ ధాన్యం గింజను కొనుగోలు చేస్తుందన్నారు.
ఎన్నికల మేనిఫెస్టో లో చెప్పిన ప్రకారం సన్నపు వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ కూడా అందిస్తుంది అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని తెలిపారు. వడ్ల కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని, దళారులను నమ్మి తక్కువ రేటుకు ధాన్యాన్ని అమ్ముకొని నష్టపోవద్దని కోరారు. కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ ఏనుగు మనోహర్, విండో కార్యదర్శి శంకర్, మాజీ సొసైటీ వైస్ చైర్మన్ గడ్డం శ్రీధర్, మాజీ సొసైటీ డైరెక్టర్ ఏనుగు దేవాయి రాజేశ్వర్, వార్డు సభ్యులు కుందేటి శ్రీనివాస్, కిషన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పడిగేల ప్రవీణ్, నాయకులు గోపిడి లింగారెడ్డి ,ఎడ్ల శ్రీకాంత్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



