- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. అంజయ్య నగర్‌లోని హరిహర మెన్ హాస్టల్‌లో వంట మనిషిగా పనిచేసే శశిధర్‌ను అదే హాస్టల్‌లో పనిచేసే ప్రమోద్ కత్తితో పొడిచి చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ప్రమోద్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఈ హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. హరిహర మెన్ హాస్టల్ యజమానితో పాటు, అందులో ఉంటున్న వారిని పోలీసులు విచారిస్తున్నారు.
- Advertisement -


