Monday, April 20, 2026
E-PAPER
Homeకరీంనగర్టీపీటీఎఫ్ రాష్ట్ర విద్యా సదస్సు విజయవంతం చేయాలి

టీపీటీఎఫ్ రాష్ట్ర విద్యా సదస్సు విజయవంతం చేయాలి

- Advertisement -

చకినాల అనిల్ కుమార్..
నవతెలంగాణ – వేములవాడ

తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 30న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్న రాష్ట్ర విద్యా సదస్సును ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చకినాల అనిల్ కుమార్ పిలుపునిచ్చారు. వేములవాడ పట్టణంలోనీ తిప్పాపూర్ ఉన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో టీపీటీఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు దుమాల రమానాద్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి విక్కుర్తి అంజయ్య, రాష్ట్ర నాయకులు కొలుగూరి కిషన్ రావుతో కలిసి విద్యా సదస్సు గోడపత్రికను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. విద్య అందరికీ సమానంగా అందకుండా విధానాలు అమలు చేస్తున్నారని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు విద్యారంగానికి తగిన నిధులు కేటాయించడం లేదని ఆరోపించారు. వందలాది ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కోసం, విద్య అందరికీ సమానంగా అందే విధంగా ప్రభుత్వ ఆధీనంలోనే విద్య నిర్వహణ కొనసాగించాలని, నైబర్‌హుడ్ కామన్ స్కూల్ విధానాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పెండింగ్‌లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని, పీఆర్‌సీ అమలు చేయాలని, 317 బాధితులకు న్యాయం చేయాలని, సీపీఎస్ రద్దు చేయాలని, ఎస్‌జీటీ ఉపాధ్యాయుల సర్దుబాటు నిబంధనలు సవరించాలని, డీఈడీ, బి.ఎడ్ ఉపాధ్యాయులకు ప్రమోషన్లలో సమాన అవకాశాలు కల్పించాలని, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేయాలని కోరారు.

రాష్ట్ర విద్యా సదస్సుకు ముఖ్య అతిథిగా పాఠశాల విద్యా సంచాలకులు డాక్టర్ నవీన్ నికోలాస్, గౌరవ అతిథిగా ప్రొఫెసర్ ఎం. కోదండరాం హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి లోకిని కిషన్, టీపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు నూగురి దేవేందర్, కెవి రజినీరాణి, జిల్లా కార్యదర్శులు పార్వతి, తిరుపతి, మండల బాధ్యులు బొజ్జ కృష్ణ, శ్రీనివాస్, సంజీవ్, శ్రీధర్, మహేష్, భూస రాజేందర్, సంతోష్, చకినాల భాస్కర్, సునీత, జ్యోతి, నీరజ, ఇతర సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -