నవతెలంగాణ-హైదరాబాద్: భారత్ వేదికగా రేపు 18వ బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సమావేశం నేపథ్యంలో వివిధ దేశాల అధినేతల రాకతో ఢిల్లీ ఎయిర్ పోర్టులో సందడి నెలకొంది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ చేరుకున్నారు. యూఎన్ కార్యదర్శికి విద్యా శాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్ స్వాగతం పలికారు. అంతకుముందు, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, ఉగాండా ఉపాధ్యక్షురాలు జెస్సికా అలుపో దేశ రాజధానికి చేరుకున్నారు. వీరికి నైపుణ్యాభివృద్ధి , పారిశ్రామికత శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) జయంత్ చౌదరి స్వాగతం పలికారు. అదే విధంగా వీఐపీల రాక నేపథ్యంలోఎయిర్ పోర్టు దగ్గర భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు.
2026 జనవరి 1 నుంచి భారత్ బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలను చేపట్టింది. అయితే భారత్ బ్రిక్స్ అధ్యక్షత వహించడం ఇది నాలుగోసారి. గతంలో 2012, 2016, 2021 సంవత్సరాల్లోనూ భారత్ ఈ బాధ్యతలను నిర్వహించింది. అంతేకాకుండా 2026వ సంవత్సరం బ్రిక్స్ ఏర్పాటై 20 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా కూడా ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం బ్రిక్స్‌లో 11 పూర్తి సభ్య దేశాలు ఉన్నాయి.

UN Secretary-General Antonio Guterres



