- Advertisement -
నవతెలంగాణ – మద్దూరు
సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలంలోని జాలపల్లి గ్రామ సర్పంచ్ చెట్కూరి కమలాకర్ యాదవ్ ను సర్పంచ్ల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించినట్లు వ్యవస్థాపక అధ్యక్షులు సాధని భూమన్న యాదవ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాదులోని లకిడికాపూల్ రాష్ట్ర కార్యాలయంలో కమలాకర్ యాదవ్ కు ఆయన నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా కమలాకర్ యాదవ్ మాట్లాడుతూ..తనపై నమ్మకంతో సర్పంచ్ల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించినందుకు వ్యవస్థాపక అధ్యక్షులు సాధని భూమన్న యాదవ్, సర్పంచుల రాష్ట్ర అధ్యక్షులు కాయితి ఆశాదీప్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -



