నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండల కేంద్రంలో మరియు గ్రామాలలో ఎడ్ల పొలాల అమావాస్య సందర్భంగా రైతు సోదరులు తమ బసవన్నలను ప్రత్యేకంగా ముస్తాబు చేసి పూజలు నిర్వహించారు. తెల్లవారుజామునే బసవన్నలకు స్నానం చేయించి, అందంగా అలంకరించి గ్రామంలోని హనుమాన్ మందిరం వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ పంటలు సమృద్ధిగా పండాలని, పాడి పంటలతో రైతు కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని రైతులు బసవన్నలను భక్తిశ్రద్ధలతో పూజించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని అందంగా ముస్తాబు చేసిన బసవన్నలను వీక్షిస్తూ సంబరాలు వ్యక్తం చేశారు. రైతు జీవితంలో పశువుల పాత్రకు ప్రతీకగా నిలిచే ఎడ్ల పండుగ మన పల్లె సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడుతుంది. రైతు బాగుంటేనే గ్రామం బాగుంటుంది… పాడి పంటలు పుష్కలంగా పండాలి… ప్రతి రైతు కుటుంబం సంతోషంగా ఉండాలి. పొలాల అమావాస్య శుభాకాంక్షలు!
ఘనంగా పొలాల అమావాస్య – ఎడ్ల పండుగ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


