సెషన్-2 ఫలితాలు విడుదల చేసిన ఎన్టీఏ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. మధ్యాహ్నం ఫైనల్ కీ విడుదల చేసిన ఎన్టీఏ అధికారులు సాయంత్రం పేపర్ 1 (బీఈ/బీటెక్) పరీక్ష తుది ఫలితాలను ప్రకటించారు. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి స్కోర్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. ఈ పరీక్షల్లో దేశ వ్యాప్తంగా 26 మందికి 100 పర్సంటైల్ స్కోరు రాగా.. వీరిలో ఏకంగా 10మంది తెలుగు విద్యార్థులే ఉండటం విశేషం. 100 పర్సంటైల్ స్కోరుతో అదరగొట్టిన వారిలో జొన్నల రోషన్ మణిదీప్ రెడ్డి (ఏపీ), మంథా శివ కామేశ్ (తెలంగాణ), నరేంద్ర బాబుగారి మహిత్ (ఏపీ), తుంగాదుర్గా సుప్రభాత్ (ఏపీ), డి.భవితేశ్ రెడ్డి (తెలంగాణ), పసల మోహిత్ (ఏపీ), సాయి రిత్విక్ రెడ్డి (తెలంగాణ), వివాన్ శరద్ మహిశ్వరి (తెలం గాణ), బి.వెంకట చంద్రశేఖర్ రెడ్డి (ఏపీ), రిషి ప్రేమ్‌నాథ్ (తెలంగాణ) ఉన్నారు. జేఈఈ (మెయిన్) సెషన్ 1, సెషన్ 2 పరీక్షల్లో విద్యార్థులు సాధించిన ఉత్తమ స్కోరును పరిగణనలోకి తీసుకొని జాతీయ ర్యాంకులను కేటాయించారు. ఈ పరీక్షల్లో రాణించి టాప్‌లో నిలిచిన 2.50 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అవకాశం కల్పిస్తారు. మే 17న జరిగే ఈ పరీక్షకు ఏప్రిల్ 23 నుంచి మే 4వరకు ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగనుంది. ‘అడ్వాన్స్డ్’లోనూ సత్తా చాటిన విద్యార్థులకు జోసా కౌన్సెలింగ్ ద్వారా ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తుంటారు.
జేఈఈ మెయిన్ ఫైనల్ కీపై అభ్యంతరాలు..
ఎన్టీఏ వివరణ
జేఈఈ మెయిన్ ఫైనల్ కీపై సామాజిక మాధ్యమాల్లో కొన్ని అభ్యంతరాలు వ్యక్తం కావడంపై ఎన్టీఏ స్పందించింది. తుది కీలను సమీక్షించినట్టు తెలిపింది. ఏప్రిల్ 8వ తేదీ సెషన్ -2 కెమిస్ట్రీ పేపర్లో ప్రశ్నకు (691121589)కు సరైన ఆన్సర్ 3 అని తెలిపింది. అలాగే, ఏప్రిల్ 2న సెషన్-2లో జరిగిన ఫిజిక్స్ పేపర్లో ప్రశ్న (691121200)కు సరైన సమాధానం ఎ ొ 60 అని తేల్చి చెప్పింది. నిపుణుల సమీక్ష అనంతరం వచ్చిన ఈ ప్రత్యామ్నాయ క్లెయిమ్‌లు తప్పుడు వ్యాఖ్యానాల ఆధారంగా ఉన్నట్టుగా పేర్కొన్న ఎన్టీఏ.. ఫైనల్ కీ లో ఎలాంటి మార్పులూ లేవని స్పష్టం చేసింది.
జేఈఈ మెయిన్‌లో తెలుగు విద్యార్థుల సత్తా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



