- Advertisement -
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ వినోద్ కుమార్‌తో కూడిన బీఆర్‌ఎస్ త్రిసభ్య కమిటీ సోమవారం ఢిల్లీ వెళ్లింది. బుధవారం కాళేశ్వరం కమిషన్‌పై హైకోర్టులో తుది తీర్పు వెలువడనుంది. ఆ వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని బీఆర్‌ఎస్ నిర్ణయించింది. దీంతోపాటు ఫిరాయింపు ఎమ్మెల్యే కేసులో న్యాయపరంగా తీసుకోవాల్సిన అంశాలపై సీనియర్ అడ్వకేట్లతో చర్చించాలని భావించింది. అందుకోసమే త్రిసభ్య కమిటీ సభ్యులు ఢిల్లీ వెళ్లినట్టు తెలంగాణ భవన్ వర్గాలు తెలిపాయి.
- Advertisement -



