– నాన్-దోస్త్ పరిధిలో ఉన్న డిగ్రీ కళాశాలల్లో అక్రమ అడ్మిషన్లను అరికట్టాలి : ఉన్నత విద్యా మండలి చైర్మెన్‌కు ఎస్ఎఫ్ఐ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఎటువంటి అధికారిక అనుమతులు లేకుండా విద్యార్థులను మోసం చేస్తున్న ‘నెక్స్ట్ వేవ్’ సంస్థపై తక్షణమే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం ఎస్‌ఎఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.అశోక్ రెడ్డి, హైదరాబాద్ జిల్లా నాయకులు ఆంజనేయులు, ప్రవీణ్ తదితరులతో కూడిన ప్రతినిధి బృందం హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మెన్ వి.బాలకిష్టారెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించింది.
ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులే లక్ష్యంగా నెక్స్ట్ వేవ్ సంస్థ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. విద్యార్థుల నుంచి లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తూ వారి భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అనుమతుల్లేని ఇటువంటి సంస్థల ప్రకటనలను నమ్మి విద్యార్థులు, తల్లిదండ్రులు మోసపోవద్దని వారు కోరారు. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ విడుదల కాలేదనే సాకుతో ప్రయివేట్ ఇంజనీరింగ్, డిగ్రీ కళాశాలలు విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికేట్లను ఆపడం అన్యాయమనీ, దీనిపై ఉన్నత విద్యామండలి కఠినమైన ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు.
నాన్-దోస్త్ పరిధిలో ఉన్న డిగ్రీ కళాశాలల్లో అక్రమ అడ్మిషన్లను అరికట్టాలనీ, ప్రయివేట్ విద్యా సంస్థల్లో విచ్చలవిడిగా పెంచిన ఫీజులను నియంత్రించాలని కోరారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కోచింగ్ సెంటర్లు, ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్‌లపై నిఘా ఉంచి, విద్యార్థులను తప్పుదోవ పట్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. శ్రీఇందూ కళాశాలలో ఫీజు రీయంబర్స్మెంట్స్ రాకపోవడంతో, యాజమాన్యం బెదిరింపులతో విద్యార్ధి ఆత్మహత్య చేసుకోని చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం ఫీజులు విడుదల చేసి ,సర్టిఫికేట్స్ ఇవ్వని ప్రయివేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
అనుమతుల్లేని ‘నెక్స్ట్ వేవ్’ సంస్థపై చర్యలు తీసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



