నవతెలంగాణ -హైదరాబాద్ : పార్లమెంట్ లో మహిళా కోటా బిల్లు వీగిపోయిన తర్వాత ప్రధాని మోడీ జాతినుద్దేశించిన చేసిన ప్రసంగం వివాదాస్పదంగా మారింది. ప్రధాని ప్రసంగం ఎన్నికల నియమావళిని ఉల్లఘించడమే అని 700 మంది కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు లో ఉండగా.. అధికారిక మీడియాలో ప్రధాని మోడీ ప్రసంగించడం కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుంది.. చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మోడీ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిందని ఆరోపిస్తూ చర్యలు తీసుకోవాలని కోరుతూ 700 మందికి పైగా పౌరులు ఈసీకి లెటర్ రాశారు. ఏప్రిల్ 23న తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లలో ఎన్నికలు జరగనున్నాయి.. మోడల్ కోడ్ ఆఫ్ కండక్టు అమలులో ఉండగా దూరదర్శన్, సంసద్ టీవీ, ఆల్ ఇండియా రేడియో వంటి అధికారిక మీడియాలో మోడీ ప్రసంగం చేయడం ఎన్రికల ప్రచారం కిందకే వస్తుందని తమ ఫిర్యాదులో ఈసీకి తెలిపారు.
ప్రధాని మోడీపై ఈసీకి 700 మంది కంప్లయింట్..!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



