నవతెలంగాణ హైదరాబాద్: ఇరాన్‌తో జరిగే రెండో విడత చర్చల్లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంపే స్వయంగా పాల్గొనే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. వ్యక్తిగతంగా కానీ, లేక వర్చువల్‌గా కానీ ఆయన ఆ చర్చలకు హాజరయ్యే అవకాశాలు ఉన్నట్టు రైటర్స్ మీడియా సంస్థ తన కథనంలో పేర్కొన్నది. ఇస్లామాబాద్‌లో రెండో విడత చర్చలు ఈ వారంలో జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఇరాన్, అమెరికా దౌత్యవేత్తల మధ్య బుధవారం ఆ చర్చలు జరిగే అవకాశం ఉన్నది. ఒకవేళ ఒప్పందంపై సంతకం చేయాల్సి వస్తే, అప్పుడు ట్రంప్ ఆ డీల్ మీట్‌కు హాజరయ్యే ఛాన్సు ఉన్నట్టు రైటర్స్ సంస్థ తన రిపోర్టులో వెల్లడించింది. అన్నీ సజావుగా సాగుతున్నాయని, రేపు చర్చలు జరిగే అవకాశం ఉన్నట్టు ఓ పాకిస్థానీ అధికారి ఇచ్చిన సమాచారాన్ని ఆ మీడియా సంస్థ షేర్ చేసింది. టెహ్రాన్, వాషింగ్టన్ మధ్య కుదిరిన రెండు వారాల సీజ్‌ఫైర్ బుధవారంతో ముగియనున్నది. అయితే ఆ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడించే అవకాశాలు లేవని ఇటీవల ట్రంప్ పేర్కొన్న విషయం తెలిసిందే.
దిగొస్తున్న ట్రంప్ … స్వయంగా..!
- Advertisement -
- Advertisement -



