– మరోకేసులో ఇద్దరు బీటెక్ విద్యార్థుల అరెస్ట్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
టెర్రస్‌పై గంజాయి సాగుచేస్తున్న ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. అలాగే మరో కేసులో గంజాయిని అమ్ముతున్న ఇద్దరు బీటెక్ విద్యార్థుల్ని కూడా అరెస్టు అయ్యారు. వివరాల్లోకి వెళ్తే…హైదరాబాద్ నాచారంలోని తూర్పు గాంధీనగర్‌కు చెందిన సీహెచ్ శశిధర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ గంజాయికి బానిసై ఉద్యోగం వదిలేశాడు. గంజాయి కొనేందుకు డబ్బు లేక తన ఇంటిపైనే కుండీల్లో గంజాయిని సాగుచేయడం మొదలుపెట్టాడు. రోజు మొత్తంలో ఎక్కువ సేపు తన ఇంటి టెర్రస్‌పైనే గడుపుతుండటంతో ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చి ఆరా తీసారు. ఇంటిపైన టెర్రస్‌లో ఏదో జరుగుతోందనే అనుమానంతో నిఘా పెట్టారు. నిఘా వర్గాల ద్వారా సమాచారం అందుకున్న ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్‌శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆర్ కిషన్ బృందం సోమవారం శశిధర్ ఇంటిపై దాడిచేశారు. ఆ భవనం టెర్రస్‌పై కుండీల్లో సాగుచేస్తున్న 17 గంజాయి మొక్కల్ని గుర్తించారు. వాటిలో కొన్ని మొక్కలకు పూలు పూయడం ప్రారంభించాయనీ, ఒక్కో మొక్క దాదాపు మూడు మీటర్ల ఎత్తుకు పెరిగినట్టు గమనించారు. వీటి ద్వారా దాదాపు పదికిలోల గంజాయి తయారవుతుందని అధికారులు అంచనా వేశారు. శశిధర్‌ను ప్రశ్నించగా, పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అరెస్టు చేసి ఘట్కేసర్ ఎక్సైజ్‌స్టేషన్‌కు అప్పగించారు.
బీటెక్ విద్యార్థుల అరెస్టు
మరో కేసులో గంజాయి అమ్ముతున్న ఇద్దరు బీటెక్ విద్యార్థులను ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. మేడపాటినగర్‌లో గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారంతో సీఐ బాలరాజు నేతృత్వంలోని బృందం ఇద్దరు బీటెక్ విద్యార్థులను అరెస్టు చేసింది. వారి నుంచి నుంచి 480 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పట్టుబడిన బండి అరుణ్‌కుమార్, బీ ఆశిష్‌లు బీటెక్ చదువుతున్నారని పోలీసులు తెలిపారు. వారిని కూడా ఘట్కేసర్ ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించారు.
టెర్రస్‌పై గంజాయి సాగుచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



