Wednesday, April 22, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం'బ్లాక్‌ లిస్ట్‌'తోనే అడ్డుకట్ట

‘బ్లాక్‌ లిస్ట్‌’తోనే అడ్డుకట్ట

- Advertisement -

– బ్యాంకింగ్‌ వ్యవస్థలో సమూల ప్రక్షాళన అవసరం
– సైబర్‌ ముఠాలకు వరంగా మారుతున్న మ్యూల్‌ ఖాతాలు
– ఆర్బీఐ గవర్నర్‌కు హైదరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ కీలక లేఖ
నవతెలంగాణ- సిటీబ్యూరో

దేశంలో ముఠాలుగా ఏర్పడి దోచుకుంటున్న సైబర్‌ నేరగాళ్లను అరికట్టాలంటే బ్యాంకింగ్‌ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడం అత్యవసరమని హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ స్పష్టం చేశారు. అమాయకుల పేర్లతో సృష్టిస్తున్న ‘మ్యూల్‌ అకౌంట్స్‌’ ప్రస్తుతం సైబర్‌ మోసాలకు కేంద్ర బిందువుగా మారాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నగర పోలీసులు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆపరేషన్‌ ఆక్టోపస్‌’ దర్యాప్తులో వెలుగుచూసిన సంచలన వాస్తవాలతోపాటు బ్యాంకింగ్‌ వ్యవస్థలోని లోపాలను వివరిస్తూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్‌ సంజరు మల్హోత్రాకు మంగళవారం సీపీ లేఖ రాశారు. ముఖ్యంగా బ్యాంక్‌ ఖాతాలను ఓపెన్‌ చేయడంలో కేవైసీ ధ్రువీకరణలో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని ప్రస్తావించారు. బ్రాంచ్‌ స్థాయి అధికారుల జవాబుదారీతనాన్ని ఫిక్స్‌ చేస్తూ అన్ని వాణిజ్య బ్యాంకులకు కఠిన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఆర్బీఐ జారీ చేసిన కేవైసీ మార్గదర్శకాలు క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయో లేదో తెలుసుకోవడానికి తక్షణమే ‘సిస్టమిక్‌ ఆడిట్‌’ నిర్వహించాలని సూచించారు. ప్రజల సొమ్ముకు రక్షణగా ఉండాల్సిన బ్యాంక్‌ సిబ్బందే సైబర్‌ నేరగాళ్లతో చేతులు కలుపుతున్నారని పేర్కొన్నారు. మహారాష్ట్రలోని నాసిక్‌ ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌లో జరిగిన ఉదంతాన్ని ప్రస్తావించారు. కమీషన్ల కోసం ఒక కేవైసీ వెరిఫైయర్‌ తన తోటి ఉద్యోగి లాగిన్‌ వివరాలను అక్రమంగా వాడుకుని మ్యూల్‌ అకౌంట్లు సృష్టించడం భద్రతా వైఫల్యానికి పరాకాష్ట అని పేర్కొన్నారు. ఆర్బీఐ నిర్దేశించిన కేవైసీ నిబంధనలను బ్యాంకులు తుంగలో తొక్కుతున్నాయని, అసంపూర్ణమైన, నకిలీ, సరైన ధ్రువీకరణ లేని పత్రాలతో ఇష్టారీతిన ఖాతాలు తెరుస్తున్నాయని తెలిపారు. సైబర్‌ నేరాలకు సహకరించి అరెస్టయిన లేదా ఛార్జిషీట్‌ నమోదైన బ్యాంకు అధికారుల వివరాలను ఆర్బీఐకి నివేదించి, వారిని శాశ్వతంగా ‘బ్లాక్‌ లిస్ట్‌’లో పెడితే మ్యూల్‌ అకౌంట్స్‌కు అడ్డుకట్ట పడుతుందన్నారు. మ్యూల్‌ అకౌంట్ల వ్యవహారాన్ని ఎప్పటికప్పుడూ సమీక్షించేందుకు ఆర్బీఐ ప్రతినిధులు, బ్యాంక్‌ అధికారులు, హైదరాబాద్‌ సిటీ పోలీసులతో కూడిన జాయింట్‌ వర్కింగ్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. ఎవరైనా సైబర్‌ మోసానికి గురైతే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ‘గోల్డెన్‌ అవర్‌’లో 1930 టోల్‌ ఫ్రీ నెంబర్‌కు కాల్‌ చేయాలని లేదా షషష.షybవతీషతీఱఎవ.స్త్రశీఙ.ఱఅలో ఫిర్యాదు చేయాలని సీపీ సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -