- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ప్రముఖ నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు(71) మంగళవారం అర్ధరాత్రి మృతి చెందారు. ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చిట్టిబాబు (ChittiBabu) గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రముఖ రచయిత త్రిపురనేని మహారథి కుమారుడే చిట్టిబాబు. 1955 జూలై 28న కృష్ణాజిల్లా గుడ్లవల్లేరులో జన్మించారు. చెన్నైలో చదువుకున్నారు. ‘సంతానం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. మొత్తం 12 సినిమాలకు దర్శకత్వం వహించడమే కాకుండా దాదాపు 30 చిత్రాల్లో తెరపై కూడా కనిపించారు.
- Advertisement -



