Wednesday, April 22, 2026
E-PAPER
Homeకరీంనగర్కిరాయి డ్రైవ‌ర్ల‌తో బ‌స్సుల డ్రైవింగ్..క‌రీంన‌గ‌ర్‌లో రోడ్డు ప్ర‌మాదం

కిరాయి డ్రైవ‌ర్ల‌తో బ‌స్సుల డ్రైవింగ్..క‌రీంన‌గ‌ర్‌లో రోడ్డు ప్ర‌మాదం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ప్ర‌స్తుతం ఆర్టీసీ కార్మికుల‌ స‌మ్మెతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో బ‌స్సులు డిపోకే ప‌రిమిత‌మైయ్యాయి. అనుభ‌వంలేని ప్ర‌యివేటు డ్రైవ‌ర్ల‌తో బ‌స్సులు న‌డ‌ప‌డంతో కరీంనగర్‌లో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. అద్దె బస్సు లారీని ఢీకొట్టింది. కరీంనగర్‌లోకి కోతిరాంపూర్ బైపాస్ వద్ద బస్సు అదుపు తప్పడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. కాగా, శిక్షణ లేని డ్రైవర్లతో బస్సులు నడిపిస్తుండటం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -