Wednesday, April 22, 2026
E-PAPER
Homeఆటలుతమ్ముడితో విభేదాలు..స్పందించిన కృనాల్ పాండ్యా

తమ్ముడితో విభేదాలు..స్పందించిన కృనాల్ పాండ్యా

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: టీమిండియా ఆల్‌రౌండర్లు, సోదరులైన కృనాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా మధ్య సత్సంబంధాలు లేవంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఆర్‌సీబీ తరఫున కృనాల్, ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ తలపడిన తర్వాత ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. ఈ నేపథ్యంలో తన తమ్ముడితో ఉన్న విభేదాల వార్తలపై కృనాల్ పాండ్యా ఎట్టకేలకు స్పందించాడు. అవన్నీ నిరాధారమైన పుకార్లని కొట్టిపారేశాడు. ఇటీవల ఆర్సీబీ పాడ్‌కాస్ట్‌లో హోస్ట్ డానిశ్‌ సైత్‌తో కృనాల్ మాట్లాడారు. ఈ సందర్భంగా డానిశ్‌ సరదాగా.. “మీకు, హార్దిక్‌కు మధ్య అంతా ఓకేనా? లేక ఏమైనా గొడవలు ఉన్నాయా?” అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కృనాల్ నవ్వుతూ సమాధానమిచ్చాడు. డానిశ్‌ జోక్యం చేసుకుని, “కొన్నిసార్లు కేన్, అండర్‌టేకర్ కూడా గొడవపడతారు” అని వ్యాఖ్యానించగా, మరోసారి “అంతా ఓకేనా?” అని అడిగారు. దీనికి కృనాల్ పాండ్యా.. “అంతా ఓకే” అని స్పష్టంగా బదులిచ్చాడు. దీంతో పాండ్యా బ్రదర్స్ మధ్య గొడవలున్నాయనే ప్రచారానికి తెరపడినట్లయింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -