Saturday, September 12, 2026
E-PAPER
Homeసోపతిఈ విజయానికి 30 ఏండ్లు

ఈ విజయానికి 30 ఏండ్లు

- Advertisement -

ఇది కథకాదు.. వాస్తవం. ఇద్దరు స్నేహితుల జీవితం. 30 ఏండ్ల పార్టనర్ షిప్. 30 ఏండ్ల స్నేహం. 1996 జనవరి 5, నిండా 20 ఏండ్లు నిండని యువకులు. ఒక ప్రయివేటు కంపెనీలో జాబ్‌ చేయడాని చేరారు. ఆ నూనూగు మీసాల పిల్లలు అప్పుడు ఊహించి ఉండకపోవచ్చు. ‘చాణక్య ఏరోనాటికల్’ అనే ఒక కంపెనీ పెడతామని. 70 మందికి జీవనోపాధిని చూపించే దీపధారులు అవుతారని. HAL లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థ నుండి ఆర్డర్స్ చేసి, బెస్ట్ కంపెనీ అనిపించుకుంటారు అని.

ఒక విచిత్రమైన విషయం వాళ్ళిద్దరి పేర్లు రమేశ్, సురేష్ అవ్వడమైతే.. ఇద్దరి పుట్టిన రోజు జనవరి 5వ తేదీనే కావడం మరో విచిత్రం. ఇద్దరు స్నేహితులు కలిసి రెడ్నమ్ అనే కంపెనీలో ఒకరికి ఒకరు పరిచయం అయ్యాక ఇద్దరిలో ఒకే ప్రశ్న… ఇలా చిన్న ఉద్యోగాలను చేసుకుంటూ కాలం గడిపేయడమేనా? ఇదే జీవితమా? అని. ఆ ప్రశ్న వాళ్ళ జీవితాన్నే మార్చేసింది. హైదరాబాద్లోని APSFC కొంత ఋణసహాయంతో అనేక కష్టాలకు ఓర్చి మిగిలిన డబ్బు వేసుకొన్నారు. ఒక చిన్న సెటర్‌లో 1996లో ఆగష్టు 17న బాలానగర్‌కు CNC వైర్ కట్ మిషన్‌ను పూణే నుండి తెప్పించుకున్నారు. ఎన్నో నిద్రలేని రాత్రులు, అనేక ప్రెజర్స్‌తో గడిపిన రోజులు. ఏం తిన్నారో, ఎప్పుడు తిన్నారో.. మెషిన్‌ను రన్నింగ్‌లో పెట్టారు. హైదరాబాద్‌లోనే మూడు మిషన్‌గా నెలకొల్పారు. ఆర్డర్లు పెరిగాయి. 2000లలో ఈ యువకులను నమ్మి HAL లాంటి పెద్ద కంపెనీల నుండి ఆర్డర్లు రావడం, వాటిని సక్సెస్ ఫుల్‌గా చేసి, మార్కెట్‌లో మంచి పేరు సంపాదించారు. అక్కడ నుండి వెనుదిరిగి చూడలేదు.
నేడు సొంతంగా బిల్డింగ్ నిర్మించుకొని ‘చాణక్య ఏరోనాటికల్’గా మార్కెట్‌‌లో సంచలనాన్ని సృష్టించారు. డిఫెన్స్ నుండి గన్ పార్ట్స్, వేరే కంపెనీలకు ఏరోనాటికల్ పార్ట్స్ తయారు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఒకరిది చాణక్యుడి ఆలోచన, మరొకరిది ఆకాశాన్ని తాకే ఆశయం. సురేష్, రమేశ్‌లు ‘చాణిక్యా ఏరోనాటికల్’కు మేనేజింగ్ డైరెక్టర్స్‌గా ఉంటూ, పారిశ్రామిక వేత్తలుగా ఎదుగుతూ, 30 ఏండ్ల తమస్నేహాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లారు.
ఈ ‘చాణక్య ఏరోనాటికల్’ ప్రపంచ ఆకాశంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ఆకాంక్షిద్దాం. పరిశ్రమను స్థాపించి 30 ఏండ్లు అయిన సందర్భంగా వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ స్నేహితులను అభినందించడానికి అనేకమంది పారిశ్రామికవేత్తలు, మేనేజింగ్ డైరెక్టర్లు వచ్చారు. అనేక ఆటుపోట్లను ఎదుర్కొని ఈపోటీ ప్రపంచంలో తమకంటూ ఒక ప్రత్యేకస్థానాన్ని ఏర్పరుచుకున్న వీరు యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. అలాగే అనేక అవార్డులు సొంతం చేసుకున్న వీరికి అభినందనలు, శుభాకాంక్షలు.

సి.హెచ్‌. ఉషారాణి,
9441228142

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -