జుట్టుపోలుగాడు : నేను కట్టర్ (కరుడు గట్టిన) హిందూని. డప్పు కొట్టి చాటింపు వేస్తున్నా. వినండహో.
నా పేరు భరద్వాజ్. నేను అనుకున్నది ఏదైనా చేసిపారేస్తా. నాకలాంటి గైడెన్స్ ఇచ్చింది మా నేతలే. ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ – దేవుని పేరిట మేం ఏదైనా చేయొచ్చు. మాకదే ధర్మకార్యం. తొక్కలో రాజ్యాంగం మాకో లెక్క కాదు. ఈ రాజ్యాంగం మాకు అనుకూలంగా మార్చేందుకు మేం ఎంతకైనా తెగిస్తాం. గతంలో తెగించాం. ఇప్పుడూ తెగిస్తాం. ఈ దేశాన్ని అఖండ హిందూ దేశంగా మర్చేందుకు నాలాంటి వాళ్ళు కోట్ల సంఖ్యలో ఉన్నారు. ఇదో పెద్ద రహస్య యంత్రాంగం. గాంధీని చంపాం. గాడ్సేను కొలుస్తాం. ఇది బహిరంగ రహస్యం. అర్థం కాకపోతే మీ కర్మ. అంబేద్కర్ మా బద్ద శత్రువు. దేశ దేశాల రాజనీతి శాస్త్రాలు రంగరించి ‘ప్రజాస్వామ్యం సామజికన్యాయం’ అని చిలుక పలుకులు వల్లిస్తే మే చూస్తూ ఊరుకుంటామా? అప్పుడూ వ్యతిరేకించాం, ఇప్పుడూ వ్యతిరేకించాం. మళ్ళీ చెప్తున్నా. ఇది హిందూ దేశం. హిందువు కాని వాడు ఇక్కడ ఉండక్కర్లా. పాకిస్తాన్ పోవచ్చు. మైనార్టీలు ఇక్కడ ఉండదల్చుకుంటే కుక్కిన పేనుల్లా పడుండాలి. వాళ్లే కాదు, వాళ్ళని బుజ్జగించేవాళ్లన్నా మాకసహ్యం. అరెరెరె… ఆఫ్ర్టాల్ నీట్ పరిక్షా పత్రం లీక్ అయిందని గా పోరలు, పోరగాళ్ళు అంత ఆందోళన చేస్తారా? ఎంత కండకావరం? పేపర్ లీక్ కావడం చాలా చిన్న విషయం. అవినీతి ఎక్కడ లేదు? అదో వింతా ఏమిటీ? కొందరు అడ్డదార్లు తొక్కుతారు. పేపర్లు అమ్ముకుంటారు. కొనుక్కుంటారు. కుట్ర అంటే ఎలా? మహాభారత యుద్ధం శుద్ధంగా జరిగిందా? ఏ పాపం తెలియని అభిమన్యుడు చనిపోలా? ఒక్కోసారి కొందరికి అన్యాయం జరుగుద్ది. అంతే… దేవుని లీల అని సరిపెట్టుకోవాలి. గగ్గోలు పెడ్తే ఎలా? పొరపాటు జరిగిందనే కదా మళ్లీ పరీక్ష పెట్టాం. అయినా విద్యామంత్రి రాజీనామా కోర్తారా!? మేం ఆడోళ్లలా చేతులకు గాజులు తొడుక్కుని కూర్చోలా.. మా ప్రతాపం మేం చూపించాం.
కేతిగాడు : అంటే ఇదంతా తెలిసే మీరు కావాలనే చేస్తున్నారా?
జుట్టుపోలుగాడు : యస్. అంతా పథకం ప్రకారమే చేస్తున్నాం. నాపేరే సొసంత్ర భరద్వాజ్. నాకు ఎక్కడ లేని స్వేచ్ఛ ఉంది. ఆ పోరి నిషూ జంతర్ మంతర్ వద్దకు రావడమే కాకుండా తన అయ్యను తీసుకొస్తదా? ఆ వచ్చినోడు ఊరికే ఉండొచ్చుగా.. చేతిలో సెల్ ఉందని వీడియోలు తీస్తూ వైరల్ చేస్తాడా..? అందుకే ఇనుపరాడ్‌తో కొట్టా. వాడు చావాల్సింది. కానీ చావలా.. ఆఫ్ మర్డర్.
కేతిగాడు : నీకు మనిషి పాణం అంటే లెక్క లేదా..?
జుట్టుపోలుగాడు : జాలి, దయ, మానవత్వం, పాపభీతి ఉంటే కట్టర్ హిందు ఎలా అవుతాడు? బాజాప్తుగా చెప్తున్నా. వాడ్ని నేనే కొట్టాను. అలాంటి వాళ్ళని చంపడమే మా పని. మైనార్టీలను, దళితులని సఫా చేసి ముల్లా ముక్త్ భారత్ సాధించడమే మా లక్ష్యం. వాడి పుర్రె పూర్తిగా పగల్లేదు. చావకుండా బతికి పోయాడు. ఈ మర్డర్ కేసు 307 సెక్షన్లోకి వస్తుంది. అయినా ఎవడూ నన్నేం పీకలేడు. గీ పోలీసుగాళ్లు కనీసం నన్ను జైల్లో కూడా పెట్టలేదు. ఎందుకో తెలుసా? భజరంగదళ్ కపిల్ మా అన్నయ్య. కేంద్రమంత్రి పాశ్వన్, ప్రధాని మోది మ బాడా భాయ్‌లు
బంగారక్క : వింటున్నారుగా.. కంటున్నారుగా ఈ కట్టర్ హిందూగాని బహిరంగ ప్రకటనా.. చాటింపు. మానవ ముసుగు వేసుకున్న కౄరమృగం. మన మధ్యనే ఇలా మానవ రక్తం రుచి మరిగిన కౄరమృగాలు సంచరిస్తున్న కాలంలో మనం జీవిస్తున్నాం. రాజ్యం అండదండలు వీళ్ళకి పుష్కలంగా ఉన్నాయి. ఒక ప్రక్క.. ‘ముస్లింలు దేశంలో ఉండొద్దనేవారు హిందువులు అసలే కాదని’ ఇతర దేశాల్లో ఆరెస్సెస్ నేత సూక్తులు వల్లిస్తుంటారు. మరోపక్క నిలువెల్లా మానవద్వేషంతో ఇక్కడ ఇలా రగిలిపోతుంటారు. ఈ భరద్వాజాను అరెస్టు చేయాలని, ఆ పాప నిషూతోపాటు కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు ఢిల్లీ పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేస్తేగాని, అతగాడ్ని తూతూ మంత్రంగానైనా నిర్బంధించక తప్పలేదు. తన తండ్రి తలపై అరవై కుట్లు పడ్డాయని ఆ పాప ఏడుస్తూ చెప్పింది. ఇదీ ఈ రాజ్యాంగంలో బాధితులైన సామాన్యులకు దక్కుతున్న న్యాయం. మరో ముఖ్య విషయం… నిజం బయటపెడ్తున్న జర్నలిస్టుల్లో ముస్లింలైన షహీన్, నఫీస్‌ఖాన్ అనే మహిళలు ఉన్నారని తెలుసుకుని పోలీసులు కక్ష కట్టి మరీ వారిని దండించారు. ఈ కట్టర్ హిందువులకు మైనార్టీలన్నా, మహిళలన్నా, సత్యం అన్నా ఎంత ద్వేషమో తెలుస్తుంది కదా….
కె.శాంతారావు, 99597 45723
కట్టర్ హిందూ చాటింపు
- Advertisement -
- Advertisement -



