Saturday, September 12, 2026
E-PAPER
Homeతాజా వార్తలునెక్ట్స్‌ లెవెల్‌ యాక్ష‍న్‌

నెక్ట్స్‌ లెవెల్‌ యాక్ష‍న్‌

- Advertisement -

హీరో నాని నటిస్తున్న పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ మీడియాతో ముచ్చటించారు. ఈ సినిమాకి మాతోపాటు నవకాంత్, రియల్ సతీష్ పని చేశారు. ఇందులో మేం రెండు భారీ యాక్షన్ బ్లాక్స్ కంపోజ్ చేశాం. ఇందులో నాని క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది. దర్శకుడు శ్రీకాంత్ చాలా కొత్తగా డిజైన్ చేశారు. రెండు జడలు వేసుకున్న హీరోను ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటి వరకు చూడలేదు. అయితే నాని ఈ స్థాయిలో యాక్షన్ చేయడం ఇదే మొదటిసారి. ఇందులో యాక్షన్ సీన్స్ చాలా హెవీగా ఉంటాయి. జడలతో యాక్షన్ సీక్వెన్స్ చేయడం మామూలు విషయం కాదు. యాక్షన్ చేస్తున్నప్పుడు ఆ జడలు రూప్‌లకు, ముఖానికి తగులుతుంటాయి. నాని కెరీర్‌ లోనే ఇంత కష్టం ఎప్పుడూ పడలేదు. నాని బేర్ బాడీతో చేసే యాక్షన్ సీక్వెన్స్‌లు ఉంటాయి. అవి స్క్రీన్‌పై చేయడం అంత ఈజీ కాదు. బాడీ బిల్డింగ్ చేయాలి. డైటింగ్‌లో ఉండాలి. అందులోనూ దర్శకుడు శ్రీకాంత్ తనకు అనుకున్నది వచ్చేంతవరకు రాజీ పడరు. ఇందులో మేం భాగమవడం అదృష్టంగా భావిస్తున్నాం. మా యాక్షన్ బ్లాక్స్ పూర్తి చేయడానికి దాదాపు పది రోజులు పట్టింది. దర్శకుడు శ్రీకాంత్ ఎంచుకున్న కథ సహజంగానే యాక్షన్‌ను డిమాండ్ చేస్తుంది. మోహన్ బాబు చాలా సినిమాలు చేశారు. కానీ ఇందులో కొత్తగా కనిపిస్తారు. ఆయనకూ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయి. మా అబ్బాయి కూడా ఇందులో పనిచేశాడు. తనకు అన్ని భాషా సినిమాలపై మంచి పట్టు ఉంది. నిర్మాత సుధాకర్ ఎక్కడా రాజీపడకుండా భారీగా ఖర్చు పెట్టి సినిమాను నిర్మించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -