- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుడిరేవు సర్పంచ్ కళావతి అన్నారు. ప్రపంచ ధరిత్రీ దినోత్సవం సందర్భంగా బుధవారం స్థానిక పాఠశాలలో ‘ఇంటింటా ఇస్తరాకు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి మోదుగు ఆకులతో విస్తరాకులను తయారు చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం బుచ్చయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -



