ఎన్‌ఎఫ్‌సి రామానుజ కూడలిలో అభిషేకాది కైంకర్యాలు
ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
నవతెలంగాణ – నాచారం
హైదరాబాద్ భగవత్ రామానుజాచార్యుల వారి 1009వ జయంతి సందర్భంగా నాచారం సర్కిల్ మీర్పేట్ హెచ్. బి కాలనీ డివిజన్ లో ఎన్‌ఎఫ్‌సి రామానుజ కూడలిలో ఉన్న స్వామివారి విగ్రహం వద్ద అభిషేకాది కైంకర్యాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు భారీగా హాజరై భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. జగద్గురువుల ఆరాధనా ఉత్సవంలో ముఖ్య అతిథిగా ఉప్పల్ శాసనసభ్యుడు బండారి లక్ష్మారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. కార్యక్రమం అనంతరం భక్తులకు స్వామివారి నివేదిత ప్రసాదాన్ని పంపిణీ చేశారు. డా. ధనుంజయ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ప్రభుదాస్, శ్రీనివాస్ రెడ్డి, అంజయ్య, వంజరి ప్రవీణ్‌తో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
భగవత్ రామానుజాచార్యుల 1009వ జయంతి వేడుకలు
- Advertisement -
- Advertisement -


