Wednesday, April 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సర్వేనెంబర్ 293పై సీఎం కార్యాలయంలో ఫిర్యాదు

సర్వేనెంబర్ 293పై సీఎం కార్యాలయంలో ఫిర్యాదు

- Advertisement -

అక్రమంగా, దౌర్జన్యంగా సరిహద్దులను తొలగించారన్న బాధితుడు
నవతెలంగాణ – అచ్చంపేట
పట్టణం శివారులోని సర్వే నెంబరు 293, బల్మూర్ మండలం పోలిశెట్టి పల్లి గ్రామపంచాయతీ శివారులోని 57 సర్వే నెంబర్లు గల 6 ఎకరాల ఒక గుంట తన భూమిని  కొందరు అగ్రకులస్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రజాప్రతినిధులు ఉద్యోగులు, 14 మంది ఆక్రమించుకున్నారని, పట్టణంలోని వలపట్ల కాలనీకి చెందిన జీలకర బాలిశ్వరయ్య ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అక్రమంగా దౌర్జన్యంగా సరిహద్దు రాళ్ళను తొలగించాడని బాధితుడు ఫిర్యాదులు పేర్కొన్నాడు. విచారణ చేసి తన భూమిని ఆక్రమించుకున్న వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చేయాలని ఫిర్యాదులో  పేర్కొన్నారు.

ఇదే సర్వే నెంబర్లు తన భూమిని ఆక్రమించుకున్నారని బాలీశ్వరయ్య లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. రాష్ట్ర లోకాయుక్త  (హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదా ) ప్రజా ప్రతినిధులు,  అధికారుల అవినీతి, నిధుల దుర్వినియోగం ఆరోపణలపై లోకాయుక్త విచారణ చేస్తుంది. పారదర్శకమైన పరిపాలన కోసం ప్రజల ఫిర్యాదులను పరిష్కరించేందుకు ఈ సంస్థ  పనిచేస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -