– పరామర్శించిన ఏఐకేఎస్ జాతీయ కార్యదర్శి వెంకట్
నవతెలంగాణ – అశ్వారావుపేట
సీపీఐ (ఎం) జిల్లా నాయకులు బుడితి చిరంజీవి గత నాలుగు రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యారు.విషయం తెలుసుకున్న ఏఐకేఎస్ జాతీయ కార్యదర్శి బి.వెంకట్ బుధవారం ఆస్పత్రిలో ఆయనను పరామర్శించారు.
గత ఆదివారం చిరంజీవి కి గుండె నొప్పి రావడం తో హుటాహుటిన రైతు సంఘం నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం మండలం వేగవరం ఆస్పత్రిలో చేర్పించారు. రెండో రోజు సోమవారం పార్టీ జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, కార్యదర్శి వర్గ సభ్యులు అన్నవరపు కనకయ్య, పుల్లయ్య, మండల కార్యదర్శి సోడెం ప్రసాద్ లు ఆస్పత్రికి చేరుకుని వైద్యం కు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. చిరంజీవి ప్రస్తుతం కోలుకుని చికిత్స పొందుతున్నారు.
ఈ క్రమంలో వెంకట్ చిరంజీవి ని పరామర్శించి ఓదార్చి మనో ధైర్యం కల్పించారు. వెంకట్ వెంట సీపీఐ (ఎం)ఏలూరు జిల్లా కార్యదర్శి రవి, జిల్లా కమిటీ సభ్యులు రామక్రిష్ణ, వెంకట్రావు లు ఉన్నారు .



