నవతెలంగాణ-ఆలేరుటౌన్
వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఆలేరు ఎస్హెచ్ఓ ఉదయ్ కిరణ్ తెలిపారు. పట్టణ కేంద్రంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఆలేరు వినాయక నిర్వాహకులు తప్పనిసరి పోలీసుల అనుమతి తీసుకోవాలన్నారు. ఉత్సవాల నిర్వహణలో ఎలాంటి ప్రమాదాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలనీ, ఏదైనా అత్యవసర పరిస్థితులు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. విద్యుత్ అధికారుల సమక్షంలోనే మండపాలకు కరెంటు కనెక్షన్ తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా డీజేలు, ప్యాడ్ బ్యాండ్లకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. వాటిని ఏర్పాటు చేసుకోవాలనుకునే నిర్వాహకులు ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకోవాలని తెలిపారు. ఉత్సవాల సమయంలో నిర్వాహకులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు. చివరిగా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రశాంతంగా వినాయక ఉత్సవాలు నిర్వహించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



