ధామా టేల్స్ బ్యానర్ పై నిఖిల్ ప్రేమ్ రాజ్ దర్శకత్వంలో ఆకర్ష ఆలపాటి నిర్మించిన చిత్రం ‘మెస్సి – లవ్ ఫ్రమ్ ఇండియా’. ఆంటోని వర్గీస్ ప్రధాన పాత్రలో నటించారు. వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్ స్కూల్ పిల్లల చేతుల మీదగా లాంచ్ చేశారు. నవంబర్ 14వ తేదీన బాలల దినోత్సవం సందర్భంగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత ఆకర్ష ఆలపాటి మాట్లాడుతూ, ‘మలయాళ చిత్రమైన ‘మెస్సి’ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. మా దగ్గర మరిన్ని వినూత్న ఆలోచనలు ఉన్నాయి, ఇటువంటి మరిన్ని ప్రాజెక్ట్స్ చేయనున్నాము. పీవీఆర్ ఉదయ్, వెంకట్ మాకు మంచి సపోర్ట్ అందించారు’ అని అన్నారు. ‘మా సినిమాకు సపోర్ట్ గా నిలిచిన అందరికీ థాంక్స్. ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం’ అని ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్ అరవింద్ బత్తిని చెప్పారు. అర్జున్ మాట్లాడుతూ, ‘ఈ సినిమా గురించి చెప్పాలి అంటే మెస్సీ ఎంత బాగా ఆడతారో, అలాగే ఈ సినిమా కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. ధామా టేల్స్ నుండి రానున్న ఈ సినిమా ప్రత్యేకంగా గుర్తుండిపోతుంది’ అని తెలిపారు.
ఎప్పటికీ గుర్తుండిపోయే ‘మెస్సి’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



