నవతెలంగాణ-హైదారాబాద్: ఇవాళ పశ్చిమ బెంగాల్, తమిళనాడులో అసెంబ్లీ పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6గంటలకు వరకు పోలింగ్ జరగనుంది. ఓటు వేసేందుకు ఓటర్లు క్యూలైన్‌లో బారులు తీరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. అంతకముందు ఉదయం ఆరు గంటలకు రెండు రాష్ట్రాల్లో మాక్ పోలింగ్ నిర్వహించి, ఈవీఎంల పనితీరును పరిశీలించారు ఎన్నికల అధికారులు. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. బెంగాల్ తొలి దఫాలో పోలింగ్‌లో భాగంగా ఇవాళ 152 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడత ఎన్నికల్లో మిగిలిన అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. మే 4న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ నెల ఏప్రిల్ 9న కేరళ, పుదుచ్చేరి, అసోంల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.




