నవతెలంగాణ-హైదారాబాద్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కారైకుడి అనే పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. యువత ఓటు హక్కును సద్వినియోగించుకొని సమాఖ్య వాదాన్ని రక్షించాలని, కొత్త ఓటర్లు ఉత్సహంగా ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాలకు తరలిరావడం ఆనందంగా ఉందన్నారు.
తమిళనాడులో ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటలకు వరకు పోలింగ్ సాగనుంది. మరో వైపు బెంగాల్లో కూడా తొలి విడత ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. 16 జిల్లాల్లో 152 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలివచ్చారు. ఈనెల 29న రెండో దఫా పోలింగ్లో మిగిలిన అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. మే 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.


