- Advertisement -
సుల్తాన్‌పూర్ : లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీపై పరువునష్టం కేసులో తీర్పును మే 2వ తేదీకి తీర్పును స్థానిక ఎంపి, ఎమ్మెల్యేల కోర్టు రిజర్వ్ చేసింది. స్థానిక బీజేపీ నాయకుడు విజరు మిశ్రా ఫిర్యాదు మేరకు 2018 అక్టోబర్‌లో ఈ పరువునష్టం కేసు నమోదయింది. అప్పటి బీజేపీ అధ్యక్షులు, ప్రస్తుత కేంద్ర హోం మంత్రి అమిత్‌షాపై రాహుల్‌గాంధీ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదుతో ఈ కేసు నమోదయింది. ఈ కేసులో 2024 ఫిబ్రవరి 20న కోర్టు ఎదుట రాహుల్‌గాంధీ లొంగిపోయారు. దీంతో కోర్టు రూ. 25 వేల చొప్పున రెండు పూచీకత్తులపై రాహుల్ గాంధీకి కోర్టు బెయిల్ మంజారు చేసింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.
- Advertisement -



