Thursday, April 23, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంహార్ముజ్‌లో అలజడి

హార్ముజ్‌లో అలజడి

- Advertisement -

మూడు నౌకలపై ఇరాన్‌ కాల్పులు
ట్రంప్‌ సీజ్‌ఫైర్‌ పొడిగించిన కొన్ని గంటలకే ఈ ఘటన
మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు!
టెహ్రాన్‌, వాషింగ్టన్‌ :
రెండు వారాల కాల్పుల విరమణ కొనసాగుతున్నంత కాలం కొంత చల్లబడిన హార్ముజ్‌ జలసంధిలో మళ్లీ అలజడి చెలరేగింది. మూడు కంటెయినర్‌ షిప్‌లపై ఇరాన్‌ కాల్పులు జరిపింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌.. టెహ్రాన్‌తో కాల్పుల విరమణను పొడిగించిన కొన్ని గంటలకే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. పశ్చిమాసియాలో యుద్ధాన్ని శాశ్వతంగా ముగించేందుకు ఇరాన్‌తో ఒక ప్రతిపాదనతో వచ్చే వరకూ దీనిని పొడగిస్తు న్నట్టు ఆయన ప్రకటించారు. ఈనెల 8న ట్రంప్‌ ప్రకటించిన రెండు వారాల సీజ్‌ఫైర్‌ గడువు దగ్గర పడుతున్న కొన్ని గంటల్లో ఈ రెండు పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం. కాగా ట్రంప్‌ సీజ్‌ఫైర్‌ పొడగింపు ప్రకటనపై ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ సలహాదారు మహ్దీ మొహ్మదీ స్పందించారు. ఆయన దీనిని ‘అర్థంలేని చర్య’గా పేర్కొన్నారు.
ట్రంప్‌ కాల్పుల విరమణ పొడిగించిన కొద్ది గంటల్లోనే ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ) హార్ముజ్‌ జల సంధిలో ఒక నౌకపై కాల్పులు జరిపినట్టు తెలిసింది. ఈ విషయాన్ని యూకే మారి టైమ్‌ ట్రేడ్‌ ఆపరేషన్స్‌ సెంటర్‌ పేర్కొంది. కాల్పుల్లో ఒక నౌకకు నష్టం వాటిల్లిందనీ, ఇందులో ఎవరికీ గాయాలు కాలేదని స్పష్టం చేసింది. అయితే తమ హెచ్చరికలను పట్టించుకోని కారణంగానే ఆ నౌకపై చర్య తీసుకు న్నట్టు ఐఆర్‌జీసీ వివరించింది. ఎంఎస్‌సీ ఫ్రాన్సెస్కా, ఎపామినోన్డాస్‌ అనే రెండు నౌకలను ఇరాన్‌ తీరానికి సమీపంలో స్వాధీనం చేసుకున్నట్టు ప్రభుత్వ వార్తాసంస్థ తెలిపింది. మరో నౌక యుఫోరియాను కూడా తీరానికి సమీపంలోనే నిలిపివేసినట్టు సమాచారం. కాల్పుల విరమణ పొడిగింపును ప్రకటించిన ట్రంప్‌ చర్యను ఇరాన్‌ తేలికగా తీసుకుంది. ట్రంప్‌ ప్రకటనను అర్థం లేని చర్యగా పేర్కొన్న మహ్దీ మొహమ్మది.. ఓడిన పక్షం నిబం ధనలు విధించలేదని అమెరికాను ఉద్దేశిస్తూ అన్నారు. నిర్బంధాన్ని కొనసాగించడం అనేది బాంబుదాడులతో తేడా లేకుండా ఉంటుందనీ, దీనికి సైనిక చర్యతోనే ప్రతిస్పందించాలని ఆయన చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -